TG: అసెంబ్లీలో ప్రభుత్వానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్ విసిరారు. 'భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గమైనా? సిద్దిపేట నియోజకవర్గమైనా? పూర్తిగా 100% రుణమాఫీ అయిందని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్తాను. ఒక్క సిద్దిపేటలోని రూ.2లక్షల రుణమాఫీ కాని వారు 10వేల మంది ఉన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతుబంధు విషయంలో రికార్డు సృష్టించాం. రుణమాఫీ కాని రైతులందరికీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం' అని అన్నారు.