TGలో హ్యుందాయ్ ఆర్‌ అండ్‌ డీ కేంద్రం.. 4,276 మందికి ఉద్యోగాలు!

TG: హైదరాబాద్‌లోని ఎమ్​సీహెచ్​ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హ్యుందాయ్ మోటర్స్ ఇండియా ఇంజినీరింగ్ ఎండీ చాంగ్యో చో నేతృత్వంలోని బృందం కలిసింది. జహీరాబాద్‌లో రూ.8,528 కోట్లతో నిర్మించనున్న గ్లోబల్ ఆర్ అండ్ డీ, మెగా టెస్ట్‌సెంటర్‌కు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు బృందం తెలిపింది. నిమ్జ్‌లో 678 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా 4,276 ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది. పెండింగ్‌లో ఉన్న అనుమతులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕