సికింద్రాబాద్: గాంధీ ఆసుపత్రి పక్కన ఇదీ పరిస్థితి!

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ప్రహరీ గోడ పక్కన పరిసర ప్రాంతాల వారు గార్బేజి వ్యర్ధాలను డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి సరైన సమయానికి తొలగించక పోవడంతో దుర్గంధ భరితపు వాసన వస్తుందని వాహనదారులు వాపోయారు. ఆసుపత్రి పక్కన వ్యర్ధాలు ఉండకుండా చూడడం పై అధికారులు చర్యలు తీసుకోవాలని, వ్యర్ధాలు డంప్ చేసిన వారి పై కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி