డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి హంసరాజు కోరారు. జీహెచ్ఎంసీ అడ్డగుట్ట డివిజన్ ఏఈగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తివారీని తుకారాంగేట్లోని వార్డు కార్యాలయంలో బీజేపీ నాయకులు శనివారం కలిసి సత్కరించారు. అంతకు ముందు ఏఈగా విధులు నిర్వహించి బదిలీపై తార్నాకకు వెళ్తున్న వేణును కూడా శాలువాతో సత్కరించారు.