గాంధీ ఆసుపత్రిలో డీఎంఈ ఆకస్మిక తనిఖీలు

గాంధీ ఆసుపత్రిలో డీఎంఈ డాక్టర్ వాణి ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. అన్ని వార్డులను ఆమె పరిశీలించారు. రోజుకు రెండు వేలకు పైగా రోగులు వచ్చే ఆసుపత్రిలో చిన్న తప్పులు జరగడం సహజమని, వాటిని భూతద్దంలో చూపించి ప్రజలను అభద్రతాభావానికి గురి చేయవద్దని ఆమె కోరారు. ఆమె వెంట సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్లు తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி