బాల్య వివాహాలు చట్ట విరుద్ధం.. మేయర్

బాల్యవివాహాలు చట్ట విరుద్ధమని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బాల్యవివాహాల పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం తయారు చేసిన పోస్టర్ ఆదివారం ఆవిష్కరించారు. బాల్య వివాహాల కారణంగా మహిళ జీవితం నాశనం కావడంతో పాటు, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. బాల్యవివాహాలు చేసిన వారిని, చేయడానికి ప్రోత్సహించిన వారిని చట్టం కఠినంగా శిక్షిస్తుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி