బుధవారం ఉదయం 11 గం. సమయంలో అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు పాల్గొని కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అనేది కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని, సామాన్య ప్రజలకు భారంగా ఉందని వాపోతూ, వెంటనే ప్రజా బడ్జెట్ తీసుకొచ్చి పార్లమెంటులో ప్రవేశపెట్టాలని 4 కార్మిక చట్టాలను, 2020 విద్యుత్ బిల్లును, 3 రైతు చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేయొద్దని డిమాండ్స్ పెడుతూ అంజయ్య భవన్ తెలంగాణ రాష్ట్ర కార్మిక కమీషనర్ కార్యాలయం ముందు నిరసన తెలుపడం జరిగింది.