మేడ్చల్: బతుకమ్మ చీరల విషయంలో ప్రభుత్వంపై గళం విప్పిన కృష్ణ గౌడ్

బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు దుర్గపు క్రిష్ణ గౌడ్ మంగళవారం మాట్లాడుతూ తెలంగాణలోని ఆడబిడ్డల కోసం కేసీఆర్ మొదలుపెట్టిన ప్రతి ఏడాది కోటి బతుకమ్మ చీరల పంపిణీ పథకానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తూట్లు పొడిచింది. పండుగ సమీపిస్తున్నా ఇప్పటి వరకు చీరల పంపిణీ ఊసే లేదు. బతుకమ్మ కానుకగా 500 నగదు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ దానిపై కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు.

தொடர்புடைய செய்தி