మల్కాజ్ గిరి: మౌలాలి గుట్టపై ర్యాంపు పనులను త్వరగా పూర్తి చేయాలి

మౌలాలి గుట్టపై భక్తులు సులభంగా చేరేందుకు ర్యాంపు నిర్మాణం కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం రూ. 20 కోట్లు కేటాయించిందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బుధవారం తెలిపారు. 2021లో ప్రారంభమైన ఈ పనులు 50% మాత్రమే పూర్తి అయ్యాయని తెలిపారు. దీనిపై తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, ర్యాంపు పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி