మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి వైపు నడిపిస్తూ బీఆర్ఎస్ ను బలోపేతం చేయాలని మాజీ సీఎం కేసీఆర్ సూచించారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీతరాము యాదవ్, ఎమ్మెల్యేతో కలిసి ఆదివారం కేసీఆర్ ను కలిశారు. స్థానికులు, కార్యకర్తలతో కలిసి ముందుకు సాగాలని ఆయన సూచించినట్లు తెలిపారు.