హైదరాబాద్: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

సీఎం రేవంత్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధానికి వెళ్లి కాంగ్రెస్‌ అధిష్ఠానంతో సమావేశం అయ్యేందుకు సోమవారం ఉదయం బయలుదేరి వెళ్లనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఉత్సవాలకు హాజరుకావాలని AICC పెద్దలను కోరనున్నట్లు సమాచారం. సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు సభకు హాజరుకావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி