ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక ప్రకటన

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ శనివారం కీలక ప్రకటన చేసింది. సోమవారం మహ గణపతి దర్శనానికి అనుమతి లేదని తెలిపింది. శని, ఆదివారం మాత్రమే అనుమతి ఇస్తామని భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. మంగళవారం నిమజ్జనం ఉండడంతో సోమవారం వెల్డింగ్ తదితర పనుల నేపథ్యంలో భక్తులను అనుమతించబోమని పేర్కొంది. కాగా మంగళవారం మధ్యాహ్నానికి లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరనున్నారు.

தொடர்புடைய செய்தி