కార్వాన్: జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే

కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం కలిశారు. నియోజకవర్గం పరిధిలో నూతనంగా రోడ్డు పనులు చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. అలాగే డ్రైనేజీ దిసిల్డింగ్ పనులు, శానిటేషన్ పనులు పక్కగా చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వీటికి సంభందించి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி