తెలంగాణాలో జరగబోయే ఎలక్షన్స్ సందర్బంగా ఎన్నికల కోడ్ అమలవుతుంది. వాహనాల తానిఖీల్లో 50వేల నగదు మరియు ఆపై విలువ ఉండే వస్తువులను తీసుకెళ్లకూడదని తెలంగాణ మొత్తంలో తనిఖీలు ముమ్మరం చేశాయి. హైదరాబాద్ నగరంలో 24గం నిఘా పెడుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్, మసాబ్ ట్యాంక్, అంబర్ పేట పలుచోట్ల బుధవారం తనిఖీ బృందాలు దర్శనమిచ్చాయి.