హైదరాబాద్: రేపు సెక్రటేరియట్ ను ముట్టడిస్తాం: జక్కని సంజయ్

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని బీసీ అజాది యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఓయూలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే రేపు సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక ఎంతో మంది విద్యార్థుల జీవితాలు ఆగమైపోతున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி