అంబర్ పేట్: హిందీ మహావిద్యాలయ కాలేజి గుర్తింపు రద్దు

విద్యానగర్ లోని హిందీ మహావిద్యాలయ కళాశాల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ఓయూ అధికారులు శనివారం ప్రకటించారు. కళాశాలలో ఓయూ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు విచారణ కమిటీ నిర్ధారించడంతో యంత్రాంగం కొరడా ఝులిపించింది. కళాశాల అనుమతులు రద్దు చేయడంతో పాటు స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాల్సిందిగా యూజీసీకి సిఫార్సు చేశారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు ఓయూ పర్యవేక్షణలో కోర్సు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించారు.

தொடர்புடைய செய்தி