భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్త

AP: మచిలీపట్నంలోని ఆర్ పేట పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య విజయ రామ దుర్గాదేవి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త మండలి శ్రీరామ్ మంగళవారం తెల్లవారుజామున ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు సమాచారం. 2024లో వివాహం చేసుకున్న ఈ దంపతుల మధ్య వివాహేతర సంబంధంపై అనుమానంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. హత్య అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி

✕
✕