ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల బీజాపూర్‌లోని పుజారి-కంకేర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పాటు మరో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్నో ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న దామోదర్ మృతి చెందినట్లు శనివారం స్వయంగా మావోయిస్టు పార్టీనే నిర్ధారించింది. 33 ఏళ్ల పాటు దామోదర్ మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేశారు. ఈయన స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి.