కొంతమంది నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో యూఐడీఏఐ కీలకమైన క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ యాప్ లేదా యూఐడీఏఐ పోర్టల్ ద్వారా కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా కార్డు నిజమైనదా? కాదా? అనేది సులభంగా తెలుసుకోవచ్చు. శనివారం యూఐడీఏఐ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, కార్డులను అంగీకరించే ముందు వాటి ప్రామాణికతను తనిఖీ చేయాలని సూచించింది.