రైతుల ఆశలు వరదపాలు

వానలు తగ్గినా పంట పొలాల్లో వరదనీరు ఇంకా తగ్గలేదు. 4.67 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 21.18 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఇందులో ఉమ్మడి గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి నీట మునింది. 65వేల ఎకరాల్లో పత్తి, 25వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతింది. వరినాట్లపైనా ఇక ఆశలు వదులుకోవడమే అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி