కెనడాలో అద్దింట్లో ఉన్న ఓ భారతీయుడి సామగ్రిని ఆ ఇంటి యజమాని బయట పారేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు వ్యక్తి ఇల్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా లేడని సమాచారం. కాగా, ఈ చిన్న వీడియో క్లిప్ లో ఇంటి యజమానిపై ఆ వ్యక్తి అరుస్తూ, ఎందుకు అబద్దం చెప్పావు అని అడగడం నమోదైంది. భారత్ అయినా అమెరికా అయినా ఇంటి ఓనర్లతో వ్యవహారాలు అంత ఈజీ కాదని ఓ యూజర్ కామెంట్ చేశారు.