కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉన్న కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు

TG: మాజీ మంత్రి KTRకు భారీ ఊరట లభించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ KTRపై పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. EC నియమావళికి విరుద్ధంగా బాణసంచా కాల్చడంతో పాటు ప్రజలకు అసౌకర్యం కలిగించారంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, సాక్షులందరూ పోలీసులేనని KTR తరఫు న్యాయవాది వివరించారు. చట్టపరంగా సరైన ఆధారాలు లేవని వెల్లడిస్తూ హైకోర్టు కేసును కొట్టివేసింది.

தொடர்புடைய செய்தி