దేశంలోని 11 రాష్ట్రాల్లో భారీ వర్షాలు: ఐఎండీ

దేశంలోని 11 రాష్ట్రాల్లో అక్టోబర్ 23న భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, అండమాన్ సముద్రంలో తుఫాను వలయం కారణంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇప్పటికే తమిళనాడులోని మదురైలో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி

✕
✕