TG: నేటి వేగవంతమైన జీవనశైలి, పని ఒత్తిడి, అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల జుట్టు రాలడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. పోషకాహార లోపం, నిద్రలేమి, కాలుష్యం దీనికి ప్రధాన కారణాలని నిపుణులు వివరిస్తున్నారు. జుట్టు రాలడాన్ని సాధారణ సమస్యగా చూడకూడదని, తలచర్మం పలుచబడటం వంటి లక్షణాలు కనిపిస్తే నిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వంటి చికిత్సలను ఎంచుకునే ముందు వైద్యులను సంప్రదించి, సమస్య మూలాలను గుర్తించడం చాలా అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.