రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ టీచర్ మృతి

TG: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని నందినగర్‌కు చెందిన టీచర్ మాలతి భవానీనగర్ తండా MPPSలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. గత నెల 13న పాఠశాలకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ కిందపడి ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕