రైతులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 20వ విడత రూ.2వేల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ ఏడాది జూన్ 7వ తేదీన రూ.2వేలు రైతుల అకౌంట్లోకి జమయ్యే అవకాశం ఉందని సమాచారం. కాగా పీఎం కిసాన్ పథకం ద్వారా 9.8 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. అయితే పీఎం కిసాన్ 20వ విడత రూ.2వేల విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.