ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా తమ ఖాతాదారులు కార్డు లేకుండానే నగదును తీసుకునే అవకాశాన్ని కల్పించింది. గతంలో కేవలం ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఇప్పుడు దానిని అన్ని ఏటీఎంలకు విస్తరిస్తూ బ్యాంక్ యాప్ ‘యోనో’ను అప్గ్రేడ్ చేసింది. దీంతో కస్టమర్లు ఏ బ్యాంకు ఏటీఎంలో అయినా కార్డు లేకుండానే నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.