రైతులకు గుడ్‌న్యూస్.. వారంలోపు మిగిలిన వారందరికీ రుణమాఫీ!

రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. వారంలోపు మిగిలిన వారందరికీ రైతు రుణమాఫీ పూర్తి అవుతుందని వెల్లడించారు. నల్గొండ జిల్లా నల్గొండ మండలం అర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు తరువాత 3 రోజుల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. సన్నాలను ప్రోత్సహించడానికే 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

தொடர்புடைய செய்தி