కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రైతుబంధుకు రాంరాం.. దళిత బంధుకు జై భీం చెబుతారని ఆనాడే చెప్పానని మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. 'తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కి ఓటేశారు. అన్ని మబ్బులు తొలగిపోయి ఇప్పుడు నిజాలు బయటికి వస్తున్నాయి. BRS విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలి. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే. ప్రాణం పోయినా సరే తెగించి కొట్లాడేది మనమే, తెలంగాణ రక్షణ మనదే. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి' అని పిలుపునిచ్చారు.