గణేష్ నిమజ్జనాలు ప్రశాంతం: డీజీపీ ఆనంద్

రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా సాగుతున్నాయని డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఐక్యత చాటారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.24 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని, శుక్రవారం ఉదయం వరకు సుమారు 88 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని, శనివారం ఉదయానికి మిగతావి పూర్తవుతాయని చెప్పారు. మతపరమైన అంశాలను గౌరవిస్తూ, నగరంలో శోభాయాత్రలు ఆలస్యంగా ప్రారంభమైనందున నిమజ్జనాలు కూడా ఆలస్యంగా కొనసాగుతున్నాయని, హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో విగ్రహాలు తరలివస్తున్నాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி

✕
✕