వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్ల, అయ్యవారిపల్లిలో ఆదివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కడుపునిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.