వనపర్తి: పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య

జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ కె. రాణి వివరాలు ప్రకారం.. వీపనగండ్ల మండల పరిధిలోని బొల్లారానికి చెందిన రాచాల శ్రీనివాస్ అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా భార్య పిల్లలతో కలిసి బ్రతుకుతెరువు కోసం మహబూబ్ నగర్ కు వచ్చాడు. కుటుంబ కలహాలతో విసుగు చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி