వనపర్తి జిల్లా కేంద్రంలోని 22వ వార్డు బాలాజీ నగర్ కు చెందిన జీవన్ రావు ఫర్నిచర్ షాపు బుధవారం ప్రమాదవశాత్తు దగ్ధమయింది. విషయం తెలుసుకునిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. సుమారు రూ. 80 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు జీవన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు అందేలా ప్రత్యేకంగా కృషి చేస్తానని, బాధితునికి భరోసా ఇచ్చారు.