నారాయణపేట ర్యాంకర్లను సన్మానించిన ఎండీ

నారాయణపేట ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న కార్మికుల పిల్లలు ఇటీవల విడుదలైన గ్రూప్ -1 ఫలితాల్లో ప్రతిభ చూపారు. కండక్టర్ శ్రీనివాసులు కూతురు వీణ డిప్యూటీ కలెక్టర్, వహీద్ కూతురు ఫాతిమినా ఫైజ్ డీఎస్పీలుగా ఎంపికయ్యారు. వారిని ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ హైద్రాబాద్ లోని తన కార్యాలయంలో శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించి అభినందించారు. తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దిన పేరెంట్స్ ను అభినందించారు.

தொடர்புடைய செய்தி