నాగర్ కర్నూల్: క్రైస్తవ సోదరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

క్రైస్తవ సోదరులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించి సర్వమత సామరస్యానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో క్రైస్తవ ఉజ్జీవ మహాసభలకు ఆయన హాజరయ్యారు. సోదరులు కొన్ని సమస్యలు పరిష్కరించాలని వాటిని అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సర్వమత ప్రార్థనలతో ప్రజల సుఖసంతోషాలతో జీవించేలా ప్రయత్నం చేయాలని ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி