నాగర్ కర్నూల్: విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చేదురుబావి తండా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయ పొలంలో సాగునీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు బావి గుంతలో పడి మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున గుర్తించి వారి మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు.

தொடர்புடைய செய்தி