నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు షటిల్ ఆడుతూ కుప్పకూలి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ఎస్ బాలు కుమారుడు యోగి హైదరాబాద్ లో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం స్నేహితులతో షటిల్ ఆడుతుండగా.. కిందపడిపోయి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.