నాగర్ కర్నూల్ లో శ్రీపురం రూట్ లోనీ వైన్ షాప్ కు కన్నం వేసి ముగ్గురు దొంగలు షాప్ లో జరపడ్డారు. కౌంటర్ లో ఉన్న 40, 000 నగదు తో పాటు కొంత మద్యం అపహరించారు. బిజినేపల్లి లో మరోవైపు షాపులో కూడా గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడి మద్యం అపహరించారు. మంగళవారం ఉదయం గుర్తించిన యజమానులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.