రుణమాఫీ జరగలేదని ఓ రైతు బైకును తగలబెట్టిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్నది. రుణం మాఫీ కాకపోవడంతో గోల గుండం గ్రామానికి చెందిన చందు అనే రైతు మనస్థాపానికి గురయ్యాడని స్థానికులు తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు ఎదుట తన ద్విచక్ర వాహనానికి నిప్పంటించి నిరసన చేశాడని వెల్లడించారు. బాధితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు.