నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం ట్యాంక్ బండ్ లో బోటు షికారు కోసం రెండు బోట్లను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి శనివారం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దసరా పండుగ సందర్భంగా ఒక బోటును ఏర్పాటు చేశారు. ఇందులో పిల్లలు పెద్దలు టూరిజం శాఖ వారి ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంలో బోటు షికారు చేయాలని కోరారు. ఈ సందర్భంగా టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే తెలియజేశారు.