అచ్చంపేట: వైద్యుడిగా మారి ఆపరేషన్ చేసిన ఎమ్మెల్యే

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ మంగళవారం డాక్టర్ గా మారారు. అచ్చంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పలు రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి స్వయంగా ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏటా సర్జరీ క్యాంపు నిర్వహిస్తూ పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేనే డాక్టర్ అవతారం ఎత్తి ఆపరేషన్ చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி