నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం అమ్రాబాద్ టైగర్ రిజర్వు నల్లమల ఫారెస్ట్ లో శనివారం మరో సారి పర్యాటకులకు పెద్దపులి కంటపడింది. ఈకో టూరిజం ప్యాకేజీలో పాల్గొన్న పర్యాటకులకు గుండం సఫారీ రోడ్ వద్ద పెద్దపులిని చూసి తమ స్మార్ట్ ఫోన్ కెమెరాలలో బంధించారు. కాగా ఆడ పులిగా గుర్తిస్తూ అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు.