మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున హైద్రాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే మన్యంకొండ వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి కనిపించడంతో తన వాహనాన్ని నిలిపి బాధితుడికి మంచి నీళ్ళు అందించి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం అంబులెన్స్ కు సమాచారం అందించి బాధితుడిని స్వయంగా అంబులెన్స్ లోకి ఎక్కించి జిల్లా ఆసుపత్రికి తరలించారు.