మక్తల్: ఆలయంలో చోరికి పాల్పడ్డ దుండగులు

మక్తల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం వెనకాల ఉన్న శ్రీ మోనేశ్వర స్వామి ( మొనప్ప) దేవాలయంలో అర్థ రాత్రి దుండగులు చోరికి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలయంలో స్వామివారి పంచలోహ విగ్రహాన్ని, హుండీ, విలువైన పూజ సామాగ్రిని దొంగిలించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி