కృష్ణ మండలం గుడేబల్లూరు గ్రామంలో బుధవారం భూమి వ్యవహారంలో దాయాదుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు కత్తులు, కట్టెలతో దాడులు చేసుకున్నారు. శంకర్ అనే వ్యక్తి వివేక్ పై కత్తితో గొంతుపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆయనను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.