వానకాలం పత్తి కొనుగోలుపై మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో మంగళవారం జిల్లా స్థాయి పత్తి కొనుగోలు కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ సంవత్సరం పత్తికి క్వింటాలుకు రూ. 7, 521 మద్దతు ధరగా ప్రకటించిందన్నారు. డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేందుకు ఆధార్ నంబర్ ను రైతుల ఖాతాలకు అనుసంధానం చేసేలా అవగాహన కల్పించాలన్నారు.