మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి జీవిత ఖైదు విధిస్తు మహబూబ్ నగర్ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి శ్రీదేవి మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం. 2017 సం. లో కర్నూలు జిల్లాకు చెందిన విజయానంద్ (45) స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదైంది. సాక్షులను విచారించిన కోర్టు నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.