మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ అధికారులతో కొత్తకోట పట్టణ అభివృద్ధి, తాగునీటి సరఫరాపై గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. పట్టణంలో మూడు కిలోమీటర్ల మేర ప్రతి వీధిలో సిసి రోడ్లు, డ్రైనేజీలను నిర్మించాలని, అమృత్ పథకం ద్వారా చేపడుతున్న నూతన ట్యాంకులు, పైప్ లైన్ లను నిర్మాణం చేయాలని, తాగునీటికి భవిష్యత్తులో శాశ్వత పరిష్కార దిశగా కృషి చేయాలన్నారు.