మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని జానంపేట గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హై మాస్ట్ లైట్స్ ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. జానంపేట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి గ్రామస్తులు, స్థానిక కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.