శంకర సముద్రం పనులను పరిశీలించిన మంత్రులు

కొత్తకోట మండలం కానాయిపల్లి శంకర సముద్రాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లెల్ల చిన్నారెడ్డి బుధవారం హెలికాప్టర్ లో శంకర సముద్రాన్ని చేరుకున్నారు. శంకర సముద్రం ఏ పనులు పూర్తయ్యాయి, ఇంకా పూర్తి కావాల్సిన పనులేమిటి, పునరావాస కేంద్రాల తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జి. మధుసూదన్ రెడ్డి, తూడి మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி